
సూపర్ స్టార్ రజినీ కాంత్కు ఉన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా
చెప్పాల్సిన పనిలేదు.. తలైవా సినిమా కోసం
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
రజినీకి తమిళంలోనే కాదు.. తెలుగులో యమ క్రేజ్
ఉంటుంది. ఇక రజినీ సినిమా వస్తుందంటే.. పెద్ద పండగే
అభిమానులు. ఇప్పటికీ యంగ్ హీరోలకు దీటుగా.. ఏ
మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస చిత్రాలను చేస్తూ
దూసుకుపోతున్నారు రజినీ. తాజాగా రజినీ నటించిన
లెటేస్ట్ చిత్రం అన్నాత్తే.. ఈ సినిమానప తెలుగులో
పెద్దన్నగా విడుదల చేశారు మేకర్స్. శివ దర్శకత్వం
వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం
చేసుకుంది. అన్నా చెల్లెలు అనుబంధం నేపథ్యంలో
తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ రజినీ చెల్లెలుగా
నటించింది. ఇక తలైవా సరసన నయనతార హీరోయిన్గా
నటించగా.. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించారు..
ఈ సినిమా దీపావళి కానుకగా నిన్న ప్రేక్షకుల ముందుకు
వచ్చింది.
Rajini
ఇదిలా ఉంటే.. తమిళనాడులో రజినీ సినిమా వస్తుందంటే
పెద్ద పండగే.. తలైవా అభిమానులు చేసే రచ్చ గురించి
తెలిసిందే. యూత్ మాత్రమే కాకుండా.. అటు ఫ్యామిలీ
ఆడియన్స్ కూడా రజినీ సినిమా అంటే రెట్టింపు సందడి
చేస్తుంటారు. ఇక ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమాతో
దీపావళిని మరింత గ్రాండ్గా చేశారు.. ఈ క్రమంలోనే
చెన్నైలోని న్యూవే అనే కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్
ఆఫర్ ఇచ్చింది. రజినీ నటించిన అన్నాత్తే రిలీజ్
సందర్భంగా నవంబర్ 5న అంటే ఈరోజు తమ
ఉద్యోగాలు ఆఫ్ డే లీవ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది.
అంతేకాదు.. దీపావళి కానుకలుగా ఉద్యోగులకు అన్నాత్తే
మూవీ ఫ్రీ టికెట్స్ ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది.
ఇంకేముంది ఆ కంపెనీ ఉద్యోగులు తెగ
సంతోషపడిపోతున్నారట. నిజాంగానే రజినీ మేనియా
ఎంతలా ఉంటుందో అర్థమవుతుంది.